ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్డు ప్రారంభం
చౌటకూర్ : సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం పరిధిలోని వెంకటకిష్టాపూర్ గ్రామంలో రూ.5 లక్షల ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో నిర్మించిన సీసీ రోడ్డును శనివారం ఘనంగా ప్రారంభించారు. గ్రామ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ రహదారిని నిర్మించినట్లు అధికారులు తెలిపారు. రోడ్డు నిర్మాణంతో గ్రామంలో వర్షాకాలంలో ఎదురయ్యే బురద, నీరు నిల్వ సమస్యలకు ఉపశమనం కలుగుతుందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గణేష్, మాజీ ఎంపీపీ సుభాష్ రెడ్డి ,సర్పంచులు, ఉప సర్పంచ్, ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా గ్రామ ప్రజలు కోరారు.
Views: 56
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
25 Jul 2026 18:16:22
సిద్ధిపేట / మర్కుక్ : పాండురంగ ఆశ్రమంలో 95 వ ఆషాడి ఉత్సవాలు పతాక స్థాయికి చేరుకున్నాయి.శనివారం తొలి ఏకాదశి సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి...
