డంపింగ్ షెడ్‌లో అనుమానాస్పద ఘటన

డంపింగ్ షెడ్‌లో అనుమానాస్పద ఘటన

గోవు మాంసం కోసినట్లు ప్రచారం... నిజమేనా..? పుకారేనా..? దర్యాప్తుతోనే తేలాల్సిన నిజం.
గ్రామపంచాయతీ డంపింగ్ షెడ్‌ను అక్రమ కార్యకలాపాలకు వినియోగిస్తున్నారనే ఆరోపణలు.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనపై గ్రామస్తుల్లో ఆందోళన.
వాస్తవాలు వెలికితీయాలని పోలీసు, పశుసంవర్ధక శాఖ అధికారులకు విజ్ఞప్తి.

టేకులపల్లి :టేకులపల్లి మండలం శంభునిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని డంపింగ్ షెడ్ వద్ద జరిగినట్లు ప్రచారం జరుగుతున్న ఓ అనుమానాస్పద ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. డంపింగ్ షెడ్‌లో గోవు మాంసం కోసినట్లు గ్రామంలో ప్రచారం జరుగుతుండటంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.స్థానికుల కథనం ప్రకారం, ఇటీవల కొందరు వ్యక్తులు డంపింగ్ షెడ్ వద్ద అనుమానాస్పదంగా కనిపించారని, అనంతరం అక్కడ మాంసం కోసిన ఆనవాళ్లు కనిపించాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అది గోవు మాంసమేనా, లేక ఇతర జంతువు మాంసమా అన్నది అధికారికంగా ఇంకా నిర్ధారణ కాలేదు.ఈ ఘటనపై గ్రామస్తులు వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరుతున్నారు. సంఘటన స్థలంలో లభించే ఆధారాలను స్వాధీనం చేసుకుని పశుసంవర్ధక శాఖ ద్వారా శాస్త్రీయ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, అవసరమైతే ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించి వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని కోరుతున్నారు.గ్రామపంచాయతీ డంపింగ్ షెడ్ ప్రజా అవసరాల కోసం నిర్మించబడిందని, అలాంటి ప్రదేశాన్ని ఎవరైనా అక్రమ కార్యకలాపాలకు ఉపయోగించి ఉంటే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా డంపింగ్ షెడ్ వద్ద పర్యవేక్షణను పెంచాలని, అవసరమైతే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కూడా సూచిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి స్పందన ఈ విషయమై శంభునిగూడెం గ్రామపంచాయతీ కార్యదర్శిని వివరణ కోరగా, "ఈ ఘటనపై నాకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. విషయం మా దృష్టికి వచ్చింది. సంబంధిత ఉన్నతాధికారులకు సమాచారం అందించి, వాస్తవాలు తెలుసుకుని అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

జాతీయ రహదారిపై వ్యక్తి అనుమానాస్పద మృతి జాతీయ రహదారిపై వ్యక్తి అనుమానాస్పద మృతి
చౌటకూర్ :సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలంలోని సుల్తాన్‌పూర్ శివారులో జాతీయ రహదారిపై బుధవారం ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మృతుడిని హైదరాబాద్‌లోని షేక్‌పేట్‌కు చెందిన కనగొల్లు...
లింగంపల్లిలో రూ.15 లక్షల సీసీ రోడ్డు పనులకు శ్రీకారం
సింగరేణి భవిష్యత్తుకు తాడిచర్ల–2 మైలురాయి
మీ సేవల్లో ఉచితంగా ఓటరు ఎన్యుమరేషన్ ఆన్‌లైన్ నమోదు : కలెక్టర్ కోయ శ్రీహర్ష
మహిళలను అవమానిస్తూ వ్యాఖ్యలు, శివ చరణ్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి.
చౌడూరులో క్రషర్ రచ్చ
ప్రేమ పేరుతో మైనర్‌పై అమానుషం.. 4 నిందితుల అరెస్ట్