మర్పల్లి పోలీస్ స్టేషన్‌లో 'నిఘానేత్రం' ప్రారంభం
మర్పల్లి, (వికారాబాద్): వికారాబాద్ జిల్లా మర్పల్లి పోలీస్ స్టేషన్‌లో 'నిఘానేత్రం' సీసీ కెమెరాల పర్యవేక్షణ వ్యవస్థను జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమెకు పోలీసులు గౌరవ వందనం సమర్పించగా, అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటి నీరు పోసి పర్యావరణ పరిరక్షణకు తన వంతు సందేశాన్ని అందించారు.స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి నిఘానేత్రం సీసీ కెమెరాల వ్యవస్థను ప్రారంభించిన ఎస్పీ, పోలీస్ స్టేషన్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు.అనంతరం పోలీస్ స్టేషన్‌లోని కేసు ఫైళ్లు, రికార్డులు, ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్లు, స్టేషన్ నిర్వహణ, మాల్ఖానా, సిబ్బంది సంక్షేమం, పరిశుభ్రత, పెండింగ్ కేసుల పురోగతి తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ, సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతి ఫిర్యాదుపై వెంటనే స్పందించాలని, ప్రజలకు సైబర్ మోసాలపై నిరంతరం అవగాహన కల్పించాలని ఆదేశించారు. అలాగే ఆత్మహత్యల నివారణ పై గ్రామాలు, విద్యాసంస్థలు, ప్రజా వేదికల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.అదేవిధంగా మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, కమ్యూనిటీ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయాలని, ప్రతి ఫిర్యాదును పారదర్శకంగా నమోదు చేసి సత్వర దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణ, రాత్రి గస్తీ, వాహన తనిఖీలు, నేరాల నియంత్రణ చర్యలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వికారాబాద్ డీఎస్పీ శ్రీ అంజయ్య, మొమిన్‌పేట్ సీఐ శ్రీ జి. వెంకట్, మర్పల్లి ఎస్‌ఐ శ్రీ ఎం.డి. రావుఫ్, పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేరాల నమోదుకు సంబంధించిన రికార్డులు, కేసుల నిర్వహణ విధానాన్ని సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు.సీసీటీవీల ఏర్పాటు కోసం సహకరించిన మర్పల్లి సర్పంచ్ రమేశ్వర్, పట్లూరు సర్పంచ్ పరుశురాం, కూడుకుంట సర్పంచ్ ప్రవీణ్‌లను శాలువాలతో సత్కరించి అభినందించారు.
Views: 75
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
25 Jul 2026 18:16:22
సిద్ధిపేట / మర్కుక్ : పాండురంగ ఆశ్రమంలో 95 వ ఆషాడి ఉత్సవాలు పతాక స్థాయికి చేరుకున్నాయి.శనివారం తొలి ఏకాదశి సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి...
