ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై పోలీసుల నిర్లక్ష్య

ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై పోలీసుల నిర్లక్ష్య

కరీంనగర్,కరీంనగర్‌లో ట్రాఫిక్ క్రమశిక్షణపై అవగాహన కల్పిస్తున్నామని చెబుతున్న పోలీసు శాఖలోనే నిబంధనల ఉల్లంఘనలు చోటుచేసుకుంటు న్నాయి. నగరంలోని ప్రధాన రోడ్డుపై విధుల్లో ఉన్న ఇద్దరు పోలీసులు నెంబర్ ప్లేట్ లేని బైక్‌పై రాంగ్ రూట్‌లో ప్రయాణించడం కనిపించింది. అదే సమయంలో సామాన్య వ్యక్తికి ఫోన్ రావడంతో బైక్‌ను సైడ్‌కు ఆపి ఫోన్ మాట్లాడుతుండడం గమనించారుట్రాఫిక్ తనిఖీల పేరుతో సామాన్య ప్రజలకు భారీ జుల్మానాలు విధిస్తున్న అదే పోలీసులు, తాము మాత్రం నిబంధనలు పాటించకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రజలు రూల్స్ పాటిస్తున్నారు. కానీ పోలీసులే పాటించట్లేదు. మేము ఫోన్ మాట్లాడితే ఫైన్, వాళ్లు రాంగ్ రూట్‌లో వెళ్లినా ఫ్రీనాఅని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.  చట్టం అందరికీ సమానం అంటారు. కానీ పోలీసులకు ఒక రకంగా, ప్రజలకు మరో రకంగా అమలు చేస్తున్నారు" అని విమర్శిస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తమ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలను అందరికీ సమానంగా అమలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Views: 33

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News