ప్రారంభానికి సిద్ధమైన కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ 

ప్రారంభానికి సిద్ధమైన కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ 

  • ఆదివారం కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి చేతుల  మీదుగా రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం
  • మల్లన్న భక్తులకు శుభవార్త రేపటి నుంచి కొమురవెల్లి లో ఆగనున్న రైలు
  • సికింద్రాబాద్ నుంచి కొమురవెల్లికి ప్రయాణ చార్జి 25 రూపాయలు 
  • సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ కు 30 రూపాయలు.
 

కొమురవెల్లి (సిద్దిపేట): రైళ్ల సమయం ఉదయం సికింద్రాబాద్ నుండి కొమురవెల్లికి 12:50 కు చేరుకుని సిద్దిపేటకు వెళ్తుంది, సాయంత్రం సికింద్రాబాద్ నుండి కొమురవెల్లి కి 8:04 నిమిషాలకు చేరుకుని సిద్దిపేట వెళ్తుంది. మనోహరాబాద్ నుంచి గజ్వేల్ మీదుగా సిద్దిపేట వరకు రైల్వే లైన్ పూర్తి కావడంతో రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి సన్నిధికి ఎంతోమంది భక్తులు వచ్చి వెళ్తుంటారు ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది దర్శించుకుంటారు. అందులో భాగంగా వారి ప్రయాణ సౌకర్యార్థం కొమురవెల్లి రహదారి పక్కన నిర్మించినటువంటి కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ ను ఆదివారం రోజున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుంది. కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ ను ఏర్పాటు చేసినందుకు గ్రామ ప్రజలు భక్తులు చుట్టుపక్కల ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. రైల్వే స్టేషన్ ఏర్పాటుకు కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయడం ద్వారా భక్తులకే కాకుండా రవాణా సౌకర్యాన్ని కూడా ఎంతగానో ఉపయోగప డుతుంది, రానున్న రోజుల్లో కొమురవెల్లి పుణ్యక్షేత్రం కూడా ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి చెందుతుంది . ఇతర రాష్ట్రాల నుండి వచ్చే భక్తులకు కొమురవెల్లి రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయడం ద్వారా సికింద్రాబాద్ నుండి కొమురవెల్లికి ప్రయాణ మార్గం సులభతరం అవుతుంది. కొమురవెల్లి రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయడంలో మల్లికార్జున స్వామి వారి ప్రధాన అర్చకులు మల్లికార్జున్ ఆలయ ప్రాముఖ్యతను వివరించి కేంద్రం నుండి అనుమతి తీసుకురావడంలో ముఖ్యపాత్ర వహించారు, అలాగే వివిధ పార్టీ నాయకులు కూడా ఎంతగానో సహకరించారు. రేపటి ప్రారంబోత్సవ కార్యక్రమంలో మంత్రి కిషన్ రెడ్డి తో పాటు బండి సంజయ్ ,జనగామ ఎమ్మెల్యే అల్లా రాజేశ్వర్ రెడ్డి రెడ్డి, వివిధ పార్టీ నాయకులు ,అధికారులు, గ్రామ ప్రజలు , మల్లన్న స్వామి భక్తులు పాల్గొననున్నారు.
 
 
Views: 591

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News