ఏకలవ్య జయంతి సందర్భంగా ఘన నివాళులు
మహబూబ్‌నగర్:మహబూబ్‌నగర్ పట్టణ కేంద్రం పద్మావతి కాలనీ గ్రీన్‌బెల్ట్‌లో ఏర్పాటు చేసిన ఏకలవ్యుని విగ్రహానికి భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఏ. గోవింద్ నాయక్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు పి. శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పి. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, గురుభక్తి, క్రమశిక్షణ, అంకితభావం, ఆత్మవిశ్వాసానికి ఏకలవ్యుడు చిరస్థాయి ప్రతీక అని పేర్కొన్నారు. అవకాశాలు లేకపోయినా తన పట్టుదలతో చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహనీయుడిగా ఏకలవ్యుడు యువతకు ఆదర్శమని అన్నారు.నేటి యువత ఏకలవ్యుని స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని విద్య, క్రీడలు, సమాజ సేవ తదితర అన్ని రంగాల్లో కృషి చేసి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, నాణ్యమైన విద్య ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేయడం బీజేపీ సిద్ధాంతమని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని తెలిపారు. ఏకలవ్యుని త్యాగం, క్రమశిక్షణ, పట్టుదల ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని, ఆయన ఆదర్శాలతో సమానత్వ సమాజ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేషన్ జనరల్ సెక్రటరీ, కార్పొరేటర్ రమేష్ కుమార్, కార్యవర్గ సభ్యుడు అంజయ్య, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు, కార్పొరేటర్ పిట్ల యాదయ్య, కార్పొరేటర్ పండురంగారెడ్డి, కార్పొరేటర్ మర్రి జ్యోతి, కృష్ణవర్ధన్ రెడ్డి, మహేష్ కుమార్, లక్ష్మణ్, రేఖ్య నాయక్, ఉపసర్పంచ్‌లు, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


