ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ఆకునూరి సుప్రియ స్పందన

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ఆకునూరి సుప్రియ స్పందన

కొత్తగూడెం,  కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 15వ డివిజన్ కార్పొరేటర్, కాంగ్రెస్ నాయకురాలు ఆకునూరి సుప్రియ స్పందించారు.ఈ సందర్భంగా ఆమె విడుదల చేసిన ప్రకటనలో, యువత తలుచుకుంటే ఏదైనా సాధించగలరని ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మరోసారి నిరూపించిందని పేర్కొన్నారు. అహింసా మార్గంలో విద్యార్థి, యువత చేసిన పోరాటం భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య పద్ధతిలో సాగిన ఉద్యమం ఫలితాన్ని సాధించిందని, దేశ యువత ఐక్యతకు ఇది నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో శాంతియుత పోరాటాలే మార్గమనే సందేశాన్ని ఈ ఉద్యమం ఇచ్చిందని ఆకునూరి సుప్రియ అన్నారు.
Views: 39

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News