ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి చేసిన బీఎల్వోకు సన్మానం
దౌల్తాబాద్(సిద్దిపేట్): ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను వేగవంతంగా, సమర్థవంతంగా పూర్తి చేసిన కోనాయిపల్లి గ్రామ బీఎల్వో మంజులను గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ శుక్రవారం ఘనంగా సన్మానించారు. గ్రామంలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియను నిర్దేశిత గడువులో పూర్తి చేసి, ప్రతి అర్హుడైన ఓటరిని గుర్తించి వివరాలను నమోదు చేయడంలో బీఎల్వో మంజులు విశేష కృషి చేశారని సర్పంచ్ కొనియాడారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటుకు ఎంతో ప్రాధాన్యం ఉందని, ఓటరు జాబితా సక్రమంగా ఉండేందుకు బీఎల్వోలు కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. గ్రామ ప్రజల సహకారంతో ఎస్ఐఆర్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శి సునైనా మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో బీఎల్వో మంజులు అంకితభావంతో పనిచేశారని తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


