బిజినాపల్లిలో రేషన్ డీలర్లతో తాసిల్దార్ సమావేశం
e-KYC 100% పూర్తి చేయాలని ఆదేశం
బిజినాపల్లి /నాగర్ కర్నూల్ : బిజినాపల్లి మండల తాసిల్దార్ కార్యాలయంలో శనివారం మండలంలోని రేషన్ డీలర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి బిజినాపల్లి మండల తాసిల్దార్ మునిరుద్దీన్,ఎన్ఫోర్స్మెంట్ తాసిల్దార్ దీప్తి,డిప్యూటీ తాసిల్దార్ రవికుమార్ హాజరై రేషన్ డీలర్లకు పలు సూచనలు చేశారు.మండలంలోని అన్ని రేషన్ కార్డులకు సంబంధించి e-KYC ప్రక్రియను ఈ నెల 31వ తేదీలోపు తప్పనిసరిగా 100% పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. ప్రతి కార్డులో ఉన్న సభ్యులందరినీ దుకాణానికి పిలిపించి, బయోమెట్రిక్ ద్వారా e-KYC పూర్తి చేయాలని స్పష్టం చేశారు.నిర్ణీత గడువులోగా e-KYC పూర్తి కాని కార్డులకు రేషన్ సరఫరాలో ఇబ్బందులు ఉంటాయని, కావున డీలర్లు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రభుత్వ ఆదేశాల మేరకు పారదర్శకంగా రేషన్ పంపిణీ జరగాలంటే e-KYC తప్పనిసరి అని తెలిపారు.డీలర్లు ప్రజలకు అవగాహన కల్పించి,ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని కోరారు.సమావేశంలో మండలంలోని అన్ని గ్రామాల రేషన్ డీలర్లు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


