కేంద్ర మంత్రి దర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే
నల్లబెల్లి(వరంగల్ జిల్లా): నీట్ పరీక్షలు సక్రమంగా నిర్వహించలేని వారు అనేక మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్త తక్షణమే రాజీనామా చేయాలని బిసి హక్కుల సాధన సమితి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది కుమారస్వామి డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో ప్రశ్నపత్రాల లీకుల వలన దేశవ్యాప్తంగా చనిపోయిన విద్యార్థుల చిత్రపటానికి శనివారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ....... గత పన్నేండేళ్ళలో వందకు పైగా ప్రశ్న పత్రాల లీకేజీల వలన ఏడు కోట్ల మందికి ఇబ్బందులు తలెత్తాయన్నారు .గత 26 రోజులుగా విద్యార్థులు డిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ప్రజాస్వామ్య యుతంగా నిరసన తెలుపుతున్నా, నైతిక బాధ్యత వహిస్తూ విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనీ అంటున్నా ప్రధానమంత్రి మోడీ, ఎన్డీఏ ప్రభుత్వం పట్టుదలకు పోతూ ధర్మేంద్ర ప్రధాన్ ను రాజీనామా చేయకుండా అడ్డు పడుతున్నారన్నారు. యువతతో చర్చించి సమస్యను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమయ్యిందన్నారు. విద్యార్థులు,యువతపై రాక్షసుల్లాగా విరుచుకు పడే విధంగా ఉసిగొల్పడం రాముడి ధర్మాన్ని పాటించడమా అని ప్రశ్నించారు.పైగా కాంగ్రెస్, బిజెపి, బీఆర్ ఎస్ పార్టీ నాయకులు పేపర్ లీకేజీలకు పాల్పడ్డారనీ పరస్పర ఆరోపణలు చేసుకొంటూ అసలు సమస్యను పక్కదారి పట్టిస్తూ రోడ్లు ఎక్కడం దారుణమన్నారు. విద్యార్థులు యువత స్వచ్ఛ రాజకీయాల్లొకి వచ్చినప్పుడే ఇలాంటి ఆదిపత్య అవినీతికరమైన సమాజాన్ని మార్చగలమన్నారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గుమ్మడి వేణు ,ముసికె భరత్, మండల నాయకులు కడియాల క్రాంతి కుమార్ ,మామిండ్ల పెద్ద ఐలయ్య, పరికి కోర్నేలు, కొనకటి రమేష్, అహ్మద్ ముస్తఫా, తదితరులు పాల్గొన్నారు.
Views: 77
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
25 Jul 2026 18:16:22
సిద్ధిపేట / మర్కుక్ : పాండురంగ ఆశ్రమంలో 95 వ ఆషాడి ఉత్సవాలు పతాక స్థాయికి చేరుకున్నాయి.శనివారం తొలి ఏకాదశి సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి...
