హరి హర క్షేత్రంలో వైభవంగా శాకాంబరి ఉత్సవం

హరి హర క్షేత్రంలో వైభవంగా శాకాంబరి ఉత్సవం

  • తొలి ఏకాదశి సందర్భంగా భారీగా తరలివచ్చిన భక్తులు
  • ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాల స్వీకరణ

పరకాల/ హన్మకొండ : తొలి ఏకాదశి సందర్భంగా పరకాల పట్టణంలోని హరి హర క్షేత్ర అయ్యప్పస్వామి ఆలయంలో శాకాంబరి ఉత్సవాన్ని ఆలయ కమిటీ శనివారం వైభవంగా నిర్వహించింది. సకల దేవతా నిలయంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి పరకాల పట్టణంతో పాటు పరిసర గ్రామాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులు అయ్యప్పస్వామిని దర్శించుకోవడంతో పాటు ఆలయ ప్రాంగణంలోని శివాలయం, శ్రీ వెంకటేశ్వరస్వామి తదితర దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. శాకాంబరి ఉత్సవం సందర్భంగా ఆలయం భక్తులతో కిక్కిరిసిపోగా, భక్తుల గోవింద నామస్మరణలు,స్వామి శరణం నినాదాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో మారుమోగింది. ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ సభ్యులు తగిన ఏర్పాట్లు చేశారు.

Views: 9

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News