చౌడేశ్వరి ఆలయ పునర్నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

చౌడేశ్వరి ఆలయ పునర్నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారం అందిస్తాను : ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి

మొరం లారీలకు ప్రత్యేక పూజలు, కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభం - డోలు డప్పులతో ఘన స్వాగతం పలికిన యాదవ సంఘం

నాగర్ కర్నూల్ : బిజినపల్లి మండల కేంద్రంలోని యాదవుల ఆరాధ్య దైవమైన శ్రీ శ్రీ శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ పునర్నిర్మాణ, అభివృద్ధి పనులు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. నాగర్ కర్నూల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆలయ అభివృద్ధి పనులను, మొరం పనులను లాంఛనంగా ప్రారంభించారు.ముందుగా ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు యాదవ సంఘం, ఆలయ కమిటీ సభ్యులు డోలు డప్పులు, మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభివృద్ధి పనుల కోసం తీసుకువచ్చిన మొరం వాహనాలకు పూజ చేసి, కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఆలయ నిర్మాణ ప్రణాళికను, పునర్నిర్మాణ పనులను క్షుణ్ణంగా పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడుతూ... బిజినపల్లి చౌడేశ్వరి ఆలయానికి ఎంతో చరిత్ర ఉందని, యాదవ సోదరుల ఆరాధ్య దైవమైన ఈ ఆలయ అభివృద్ధికి తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయించి ఆలయాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేస్తామని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో బిజినపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మిద్దె రాములు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంగనమోని తిరుపతయ్య, కత్తె ఈశ్వర్, డిప్యూటీ మహేష్ యాదవ్, కేటీ తిరుపతయ్య, మాజీ ఎంపీపీ ఎద్దుల రాములు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నాజీర్, పండ్ల పాషా, ముక్తార్, చౌడేశ్వరి ఆలయ కమిటీ చైర్మన్ మరియు సభ్యులు, యాదవ కుల పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

WhatsApp Image 2026-09-22 at 2.01.25 PM

Views: 45

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News