కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై కాంగ్రెస్ కుట్ర
హైకోర్టులో కేసు వేయించి స్టే తెప్పించారు - నర్దాసు లక్ష్మణ్‌రావు
కరీంనగర్, : కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కుట్ర చేస్తోందని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్సీ నర్దాసు లక్ష్మణ్‌రావు ఆరోపించారు. ఎన్నికల ముందు ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోలేక పథకాలను నిలిపివేసేందుకు ప్రభుత్వమే తెరవెనుక నుండి హైకోర్టులో కేసు వేయించిందని ఆయన తీవ్రంగా విమర్శించారు.బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు, మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆదేశానుసారం నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో బీఆర్‌ఎస్ శ్రేణులు భారీ నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నర్దాసు లక్ష్మణ్‌రావు ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు చట్టబద్ధత లేదంటూ కోర్టు స్టే విధించిన నేపథ్యంలో, కావాలనే ఒక వ్యక్తితో పిటిషన్ వేయించింది ప్రభుత్వమేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. కోర్టు రెండుసార్లు కౌంటర్ దాఖలుకు గడువు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసిందని, ఫలితంగానే ఈ పథకాలపై స్టే ఉత్తర్వులు వచ్చాయని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని మంచి న్యాయనిపుణులను నియమించి, కోర్టులో బలమైన కౌంటర్ దాఖలు చేయాలని డిమాండ్ చేశారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టి ఈ పథకాలకు చట్టబద్ధత కల్పించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.ఈ నిరసన కార్యక్రమంలో నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్, కార్పొరేటర్లు నలువాల రవీందర్, యూసుఫ్, మాజీ కార్పొరేటర్లు, మైనారిటీ నాయకులు, బి ఆర్ ఎస్ వి యూత్ నాయకులు, మహిళా శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Views: 9
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
17 Aug 2026 17:10:18
మర్పల్లి, (వికారాబాద్): మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం ఐదు భూ సంబంధిత ఫిర్యాదులు అందినట్లు ఎంపీడీవో శాంతమ్మ తెలిపారు. ప్రజల...
