సుల్తాన్‌పూర్‌లో అంగరంగ వైభవంగా కోలాటాల కార్యక్రమం
హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక కార్యక్రమాలు
చౌటకూర్, : చౌటకూర్ మండలం పరిధిలోని సుల్తాన్‌పూర్ గ్రామంలో ఒక్కటి వినాయకుని పెట్టడము 60 సంవత్సరాలుగా గ్రామంలో ఆనవాయితీగా హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో కోలాటాల కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనగా, యువతతో పాటు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా యువత, మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా కోలాటాలు ఆడుతూ సందడి చేశారు. సంప్రదాయ దుస్తులు ధరించి కోలాటాల్లో పాల్గొన్న వారు ఆకట్టుకున్నారు. కోలాటాల కార్యక్రమాన్ని వీక్షించేందుకు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో గ్రామంలో సందడి నెలకొంది.హనుమాన్ యూత్ సభ్యులు కార్యక్రమాన్ని సమన్వయం చేస్తూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. గ్రామీణ సంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింబించేలా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని గ్రామస్తులు పేర్కొన్నారు.యువతను సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడంతో పాటు గ్రామంలో ఐక్యత, సోదరభావం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమం చివరి వరకు గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొని కోలాటాల ప్రదర్శనలను ఆస్వాదించారు.

About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


