చాకలి వీరనారి ఐలమ్మ స్ఫూర్తి ఆదర్శం తీసుకోవాలి
దౌల్తాబాద్ లో ఐలమ్మ చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న పలు పార్టీల నాయకులు
హత్నూర : హత్నూర మండల పరిధిలోని దౌల్తాబాద్ లో శనివారం నాడు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను పలు పార్టీల నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలు పార్టీల నాయకులు మాట్లాడుతూ సబ్బండవర్గాల ఆత్మగౌరవానికి మహిళలు చైతన్యానికి ఆమె ప్రత్యేకంగా నిలిచారని వారు తెలిపారు ఐలమ్మ సేవలను స్మరించుకుంటూ ఆమె పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ వీరేశం దౌల్తాబాద్ పటేల్ ఉప సర్పంచ్ శేఖర్ గౌడ్ సంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకులు బిట్ల మహేష్ దౌల్తాబాద్ గ్రామపంచాయతీ సభ్యులు అసాజీ శ్రవణ్ హత్నూర మండల్ బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండి ఇబ్రహీం హత్నూర మండల్ బిఆర్ఎస్ యువత అధ్యక్షులు తుమ్మలపల్లి కిషోర్ తదితరులు పాల్గొన్నారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


