అంగన్‌వాడీ సేవలకు బీజేపీ సత్కారం.. చిన్నారులకు కానుకలు

అంగన్‌వాడీ సేవలకు బీజేపీ సత్కారం.. చిన్నారులకు కానుకలు

  • సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా ‘అంగన్ మిలన్ సేవ’
  • అంగన్‌వాడీ సిబ్బందిని సన్మానించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు యు. రమేష్ కుమార్

తాండూరు (వికారాబాద్ జిల్లా) ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ చేపట్టిన సేవా సంకల్ప అభియాన్లో భాగంగా తాండూరు పట్టణం 33వ వార్డు అంగన్‌వాడీ కేంద్రం–1లో ‘అంగన్ మిలన్ సేవ’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్థానిక వార్డు కౌన్సిలర్ డి. శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు యు. రమేష్ కుమార్ పాల్గొని అంగన్‌వాడీ సిబ్బందిని సన్మానించారు.అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారుల సంరక్షణ, పోషణ, ప్రాథమిక విద్యకు అంకిత భావంతో సేవలందిస్తున్న సిబ్బందిని ఈ సందర్భంగా అభినందించారు. అనంతరం చిన్నారులకు పుస్తకాలు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రమేష్ కుమార్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు ప్రజల భాగస్వామ్యంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 7 వరకు ప్రతి అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి, అక్కడి సిబ్బందిని సన్మానించి వారి సేవలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. “అంగన్‌వాడీ సిబ్బంది సేవలు సమాజానికి ఎంతో విలువైనవి. చిన్నారుల భవిష్యత్తుకు పునాది వేసే కేంద్రాల్లో వారు చేస్తున్న సేవలను గుర్తించి గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత” అని రమేష్ కుమార్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రజలకు అందుతున్న సేవలను కూడా ఈ సందర్భంగా ప్రజలకు వివరించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు నగారం మల్లేశం, బిజెపి నాయకులు కృష్ణ ముదిరాజ్, జిల్లా కార్యదర్శి భద్రేశ్వర్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ప్రగతి నగర్ ఎన్ ఆర్ ఐ కాలనీలో గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ కొలన్ హన్మంత్ రెడ్డి: ప్రగతి నగర్ ఎన్ ఆర్ ఐ కాలనీలో గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ కొలన్ హన్మంత్ రెడ్డి:
మేడ్చల్ మల్కాజ్గిరి  : ఎన్ఆర్ఐ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్...
అత్యవసర సమయంలో అండగా.. సీఎం సహాయనిధి
బోర్డు పరీక్షలకు ఇప్పటినుంచే సన్నద్ధం కావాలి:జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.
ఉత్తమ విద్యార్థులకు శ్రీరామ్ గ్రూప్ చేయూత.
వినాయకుని నెలకొల్పడం అభినందనీయం 
గంభీరావుపేటలోముఖ్యమంత్రికి కృతజ్ఞతలు
యు -19 క్రికెట్ లో జాతీయ స్థాయి కి ఎంపికైన దమ్మన్నపేట ఆదర్శ పాఠశాల పూర్వ విద్యార్థిని