కాంస్య పథకం సాధించిన విద్యార్థినికి మెడల్స్, సర్టిఫికెట్ అందజేసిన తహసిల్దార్ సతీష్ కుమార్
నారాయణ పేట జిల్లా, మక్తల్ పట్టణం లో అస్మిత ఖెలో ఇండియా కోచ్ డాక్టర్ మాక్స్వెల్ ఆధ్వర్యంలో ఈనెల 19,20 తేదీలలో హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ వేలో డ్రం సైకిలింగ్ అకాడమీలో జరిగిన, తెలంగాణ రాష్ట్ర స్థాయి అస్మిత ఖే లో ఇండియా ఉమెన్స్ ట్రాక్ సైక్లింగ్ 500మీ .పోటీలలో, నారాయణపేట జిల్లా మక్తల్ మండల కేంద్రం బసవేశ్వర కాలనీ లో నివసిస్తూ ప్రైవేటుగా ఎలక్ట్రిషన్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్న సర్ సాగర్ గోపి సుధా ఏకైక కూతురు శ్రీ చందన పాల్గొని, క్రీడా ప్రతిభను చాటి ట్రాక్ సైక్లింగ్ లో కాంస్య పథకం సాధించినందుకు, ఈనెల 23న మక్తల్ తాసిల్దార్ సతీష్ కుమార్ , సైకిలింగ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి. గోపాలం తాసిల్దార్ కార్యాలయంలో మెడల్, సర్టిఫికెట్ అందజేసి ఘనంగా సన్మానించి అభినందించారు. తాసిల్దార్ సతీష్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, స్పోర్ట్స్ కోటాలో పై చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు సర్టిఫికెట్స్ ఉపయోగపడతాయని, రిటైర్మెంట్ తర్వాత విశ్రాంతి తీసుకోకుండా చాలామందిని జాతీయస్థాయి, రాష్ట్రస్థాయి క్రీడలకు సొంత ఖర్చులతో పంపుచున్న బి.గోపాలమును అభినందించారు. శ్రీ చందన ప్రస్తుతము సాయి జ్యోతి ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నది. ఈ కార్యక్రమంలో సైకిల్ రైడర్ తండ్రి సర్ సాగర్ గోపి పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


