ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటళ్లలో ఫైర్ సేఫ్టీపై మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్ష
- అన్ని హెల్త్ ఫెసిలిటీస్లో ఫైర్ సేఫ్టీ ఆడిట్పై అధికారులతో చర్చ..
- హాస్పిటళ్లలో ఫైర్ సేఫ్టీ ప్రమాణాల అమలు, లోపాల గుర్తింపు, సరిదిద్దే చర్యలపై సమీక్ష...
హైదరాబాద్:ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటళ్లలో ఫైర్ సేఫ్టీపై మంత్రి దామోదర్ రాజనర్సింహ గురువారం సమీక్షించారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో ఫైర్ సేఫ్టీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, ఫైర్ సేఫ్టీ ఆడిటింగ్ కూడా రెగ్యులర్గా చేపిస్తున్నామని మంత్రికి ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు వివరించారు. ఇప్పటికే నిర్వహించిన ఫైర్ ఆడిట్లలో గుర్తించిన అంశాలు, తీసుకున్న చర్యలపై మంత్రి సమీక్షించారు. ఫైర్ సేఫ్టీ లోపాలు ఉన్నచోట తక్షణమే అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సెక్రటేరియట్లో జరిగిన ఈ సమావేశంలో స్పెషల్ సీఎస్ నవీన్ మిట్టల్, ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ డీజీ విక్రమ్ సింగ్ మాన్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, హెల్త్, ఎనర్జీ, ఆర్ అండ్ బీ, తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


