ప్రజావాణికి 19 ఫిర్యాదులు.. మూడు పెండింగ్
నాంపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నేటి వరకు ఐదు సార్లు ప్రజావాణి నిర్వహించారు. ఇట్టి ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి మొత్తం 19 ఫిర్యాదులు, వినతులు అందినట్లు ఎంపీడీవో రామకృష్ణ శర్మ తెలిపారు. వివిధ విభాగాల నుంచి వచ్చిన వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజలు తమ అర్జీలను అధికారులకు సమర్పించారు.ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులకు పంపించి, పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తూ త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీడీవో తెలిపారు. ఇప్పటివరకు అందిన అర్జీలలో ఎక్కువ సమస్యలను పరిష్కరించామని, మరో మూడు ఫిర్యాదులు డిగ్రీ కళాశాల, మున్సిప్ కోర్టు,బస్టాండ్ నిర్మాణం పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మూడు పిర్యాదులు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించేవని అన్నారు.పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులపై సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని త్వరగా పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలు తమ సమస్యలను ప్రజావాణి ద్వారా అధికారుల దృష్టికి తీసుకురావాలని, అర్జీల పరిష్కారానికి అధికారులు బాధ్యతతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


