బిజినపల్లి పోలీసు స్టేషన్ లో ఘనంగా వినాయకుని నిమజ్జన వేడుకలు

- ప్రత్యేక పూజలు నిర్వహించిన డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్

బిజినపల్లి పోలీసు స్టేషన్ లో ఘనంగా వినాయకుని నిమజ్జన వేడుకలు

జిల్లా నాగర్ కర్నూల్   బిజినపల్లి పోలీస్ స్టేషన్ లో వినాయక చవితి నిమజ్జన వేడుకలను పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహానికి నాగర్ కర్నూల్ డీఎస్పీ బుర్రి శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకలకు నాగర్ కర్నూల్ సీఐ అశోక్ రెడ్డి, బిజినపల్లి ఎస్ఐ షంషుద్దీన్, తాడూరు ఎస్సై రాములు, తిమ్మాజిపేట ఎస్ఐ శ్రీనివాసరావు హాజరయ్యారు. అనంతరం డీఎస్పీ బుర్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. గ్రామాల్లో కల్మషం లేని వాతావరణాన్ని అలవర్చుకోవాలని, వినాయక నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో జాగ్రత్తగా నిర్వహించుకోవాలని సూచించారు.పూజల అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ నుండి వినాయకుడిని  ఊరేగింపుగా తీసుకవెళ్లి నిమజ్జన వేడుకలు పూర్తి చేశారు.ఈ వేడుకలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మిద్దె రాములు, మాజీ సర్పంచ్ గంగానమోని తిరుపతయ్య, పోలీస్ సిబ్బంది, విలేకరులు, ప్రజలు పాల్గొన్నారు.

Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News