బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలి. సిపిఐ 

బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలి. సిపిఐ 

బెల్లంపల్లి / మంచిర్యాల :ఎన్నికల్లో బ్యాలెట్‌ పేపర్‌ విధానాన్ని పునరుద్ధరించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని సీపీఐ రాష్ట్ర కంట్రోల్‌ కమిషన్‌ కార్యదర్శి మిట్టపల్లి వెంకటస్వామి డిమాండ్‌ చేశారు.  సీపీఐ జాతీయ సమితి పిలుపుమేరకు ఆగస్టు 6 నుంచి 14 వరకు నిర్వహిస్తున్న ప్రజా చైతన్య యాత్రలో భాగంగా బుధవారం బెల్లంపల్లిలో పోరు యాత్ర చేపట్టారు. పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి అధ్యక్షతన భగత్‌సింగ్‌, అమరజీవి మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి యాత్రను ప్రారంభిం చారు. ఈ సందర్భంగా మిట్టపల్లి వెంకటస్వామి, సీపీఐ బెల్లంపల్లి నియోజకవర్గ కార్యదర్శి దాగం మల్లేష్‌ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యపరిచేందుకే యాత్ర చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వ విద్య, వైద్య రంగాలను బలోపేతం చేయాలని, యువతకు ఉపాధి కల్పించాలని, ధరల పెరుగుదలను అరికట్టాలని కోరారు. రైతుల పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, దళితులు, ఆదివాసీలపై దాడులను అరికట్టాలని, మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్మిక హక్కులను పరిరక్షించాలని, బ్యాలెట్‌ పేపర్‌ విధానంలో ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని కోరారు. బెల్లంపల్లి పట్టణంలో రోడ్డు విస్తరణతో ఉపాధి కోల్పోయిన వారికి ప్రత్యా మ్నాయ ఉపాధి కల్పించాలని, పట్టణ పరిసరాల్లో ప్రభుత్వ భూముల ఆక్రమణలను అరికట్టాలని, ప్రజలకు క్రమం తప్పకుండా మంచినీరు సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యురాలు బొల్లం పూర్ణిమ, జిల్లా కార్యవర్గ సభ్యుడు చిప్ప నరసయ్య, బీకేఎంయూ జాతీయ సమితి సభ్యుడు అక్కెపల్లి బాబు, బెల్లంపల్లి మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ, తాండూర్‌ మండల కార్యదర్శి కొల్లు బానేష్‌ తదితరులు పాల్గొన్నారు. 
Views: 12

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News