నాగర్‌కర్నూల్ జిల్లాలో మహిళా అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

నాగర్‌కర్నూల్ జిల్లాలో మహిళా అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

నాగర్ కర్నూల్ / జినపల్లి, : నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం ఇప్పల తండాలో 46 ఏళ్ల మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది.మృతురాలిని కేతావత్ చిట్టెమ్మ (46)గా గుర్తించారు. లట్టుపల్లి సమీపంలోని ఓ రైస్ మిల్లులో ఆమె పనిచేస్తోంది. ఆదివారం పనికి వెళ్లి ఇంటికి వచ్చి నిద్రించినట్లు స్థానికులు తెలిపారు.సోమవారం ఉదయం ఎంతకీ ఇంటి తలుపులు తెరవకపోవడంతో చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చింది. ఇంట్లోకి వెళ్లి చూడగా చిట్టెమ్మ మృతి చెంది ఉండడం గమనించారు.సమాచారం అందుకున్న బిజినపల్లి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఎస్సై శంషాద్దీన్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల కారణాలు తెలిసే అవకాశం ఉంది.చిట్టెమ్మ భర్త జుంపాలియా మూడేళ్ల క్రితం బావిలో పడి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఘటనపై పోలీసులు పలు కోణాల్లో విచారిస్తున్నారు.  
Views: 43

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డికి ఇండియన్ పోలీస్ మెడల్ కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డికి ఇండియన్ పోలీస్ మెడల్
కరీంనగర్,  : నక్సల్స్ కార్యకలాపాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడిలో విశేష సేవలు అందించిన కరీంనగర్ రూరల్ సీఐ అనుముల నిరంజన్ రెడ్డికి ఇండియన్ పోలీస్ మెడల్...
పక్కాగా 22-ఏ జాబితా రూపకల్పన
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై కాంగ్రెస్ కుట్ర
యూసుఫ్ పేటలో ఘనంగా నాగుల పంచమి వేడుకలు 
పరకాల పాలిటెక్నిక్ ఎదుట ఎస్ఎఫ్ఐ ధర్నా
శివంపేటలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని రైతుల వినతి
5వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు