సీతారాంపూర్‌లో ఉచిత వైద్య శిబిరం
290 మందికి ఉచిత వైద్య పరీక్షలు, చికిత్స
షాబాద్, (రంగారెడ్డి): సీతారాంపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ పావని చెన్నయ్య ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. పట్నం మహేందర్ రెడ్డి జనరల్, మెడికల్ కాలేజ్ వైద్యులు శిబిరంలో పాల్గొని గ్రామస్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.థైరాయిడ్, కంటిచూపు, ఆర్థోపెడిక్ తదితర సమస్యలకు సంబంధించి వైద్యులు పరీక్షలు చేసి అవసరమైన వారికి చికిత్స, వైద్య సలహాలు అందించారు. ఈ శిబిరంలో మొత్తం 290 మంది గ్రామస్థులు వైద్య సేవలను వినియోగించుకున్నారు.గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించడం అభినందనీయమని గ్రామస్థులు పేర్కొంటూ, శిబిరం నిర్వహించిన నిర్వాహకులకు, వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు,గ్రామస్తులు పాల్గొన్నారు.
Views: 3
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
13 Aug 2026 18:24:32
ప్రశ్నించే గొంతే కమ్యూనిజం
దేశ భవిష్యత్తు కు అసలైన దిక్సూచి ఈ కమ్యూనిజం
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహ.
