గులాబీ దళపతి జన్మదినాన.. పెన్‌పహాడ్‌లో ‘సేవా’ గర్జన
పెన్‌పహాడ్, (సూర్యాపేట): మాజీ మంత్రి, ప్రస్తుత శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు పెన్‌పహాడ్ మండల కేంద్రంలో శనివారం పండుగ వాతావరణంలో అత్యంత ఘనంగా జరిగాయి. బిఆర్ఎస్ పార్టీ మండల నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలు అంబరాన్ని అంటాయి. మండల వ్యాప్తంగా గులాబీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో మండల కేంద్రం జనసందోహంగా మారింది. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా బాసిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ నెమ్మది బిక్షం హాజరై, జగదీశ్వర్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ಬಿఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొంగరి యుగంధర్ ఆధ్వర్యంలో ఈ సంబరాలు నిర్వహించారు. కార్యక్రమానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు జగదీశ్వర్ రెడ్డికి మద్దతుగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అనంతరం నాయకుల మధ్య భారీ కేక్ కట్ చేసి, ఒకరికొకరు తినిపించుకున్నారు. ప్రజలకు, కార్యకర్తలకు పెద్ద ఎత్తున స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. పుట్టినరోజు వేడుకలు కేవలం సంబరాలకే పరిమితం కాకుండా సేవా స్ఫూర్తిని చాటాయి. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ రాజేష్ సమక్షంలో దాదాపు వంద మందికి పైగా యువకులు, బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్‌లు దోస పహాడ్ వలపట్ల సైదమ్మ లింగయ్య, భక్తలాపురం సర్పంచ్ యమునా గణేష్, మాజీ సర్పంచ్ పరెడ్డి సీతారాం రెడ్డి, చెన్ను శ్రీనివాసరెడ్డి, కే సి రెడ్డి కోటిరెడ్డి, ధారావత్ బిక్షం, అంజి నాయకులు ఉత్సాహంగా రక్తదానం చేశారు. ఆపదలో ఉన్నవారి ప్రాణాలు కాపాడేందుకు కార్యకర్తలు ఇంత పెద్ద సంఖ్యలో రక్తదానానికి ముందుకు రావడం విశేషం.ఈ కార్యక్రమంలో ధర్మాపురం సర్పంచ్ దివ్య లింగస్వామి, పిఎసిఎస్ చైర్మన్ వెన్న సీతారాం రెడ్డి, జానకిరామ్ రెడ్డి, నాగార్జున, మాజీ ఎంపీటీసీ జూలకంటి వెంకటరెడ్డి, మిరియాల వెంకటేశ్వర్లు, దంతాల వెంకన్న, సైదులు, ప్రభాకర్ రెడ్డి, కొండ జానకి రాములు, నవీన్, ఒగ్గు గోపి, ఎల్లంల జగన్, వరికుప్పల రాము, లక్ష్మణ్, జూలకంటి రాజశేఖర్ రెడ్డి, సద్దల వంశీ, షేక్ షరీఫ్, సతీష్, భూక్య నరేందర్, సురేందర్, భూక్య వీరేందర్, గంగారపు సతీష్, నర్సిరెడ్డి, రణపంగా సైదులు, నెమ్మది కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


