సేంద్రియ పంటలు పండించాలి - ఎమ్మెల్యే వెడ్మ బోజ్జు
ఉట్నూర్ : తెలంగాణ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ ఆధ్వర్యంలో ఉట్నూర్‌లో గిరిజన, ఆదివాసీ రైతుల సమస్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు మాట్లాడుతూ రైతులు సేంద్రియ పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. సేంద్రియ వ్యవసాయం ద్వారా దిగుబడులతో పాటు నేల సారాన్ని కాపాడుకోవచ్చని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమానికి రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బోజ్జు, ఐటీడీఏ పివో మంద మకరందు, ఆర్డివో మోహన్ నాయక్, ఏపీవో భాస్కర్, డి.డి. ప్రేమకళ, కమిషన్ మెంబెర్స్ మాజీ ఎమ్మెల్సీ రాములు, సునీల్ కుమార్, గోపాల్ రెడ్డి, గడుగు గంగాధర్, కే.వి.ఎన్. రెడ్డి, భవాని రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Views: 7
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
07 Aug 2026 18:17:29
చౌటకూర్, :సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం పరిధిలోని మంజీర నది పక్కన ఉన్న నక్షబాట (రైతుల దారి) మరియు FTL (ఫుల్ ట్యాంక్ లెవల్) పరిధిలో జరుగుతున్న...
