చౌటకూర్ మండలంలో అభివృద్ధి పనులపై అదనపు ప్రోగ్రాం ఆఫీసర్ మధులత 

చౌటకూర్ మండలంలో అభివృద్ధి పనులపై అదనపు ప్రోగ్రాం ఆఫీసర్ మధులత 

చౌటకూర్: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం కేంద్రంలో మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం రోజున వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా అదనపు ప్రోగ్రాం ఆఫీసర్ మధులత ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో వీవీజీ రాంజీ పనులు, జలసిరి కార్యక్రమం, కూలీల సంఖ్య పెంపు తదితర అంశాలపై సుదీర్ఘంగా సమీక్షించారు.ఈ సందర్భంగా మండలంలోని ఆయా గ్రామాల్లో కొనసాగుతున్న పనుల పురోగతి, కూలీలకు ఉపాధి కల్పించే విధానం, చేపట్టిన పనుల స్థితిగతులు మరియు జలసిరి కార్యక్రమం అమలు తీరుపై అధికారుల నుంచి వివరాలు సేకరించారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు, గ్రామాల్లో ఉపాధి అవకాశాలను మరింత పెంచేలా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.క్షేత్ర స్థాయిలో నిరంతరం పర్యవేక్షణ చేపట్టి, పనుల పురోగతిని ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు పూర్తి ప్రయోజనం చేకూరేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.ఈ సమావేశంలో ఎంపీడీవో కే. శంకర్, ఏపీఓ రామ్మోహన్, టీఏలు రమేష్, ప్రతాపరెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. 

 
Views: 7

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

చౌటకూర్ మండలంలో అభివృద్ధి పనులపై అదనపు ప్రోగ్రాం ఆఫీసర్ మధులత  చౌటకూర్ మండలంలో అభివృద్ధి పనులపై అదనపు ప్రోగ్రాం ఆఫీసర్ మధులత 
చౌటకూర్: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం కేంద్రంలో మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం రోజున వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా...
జాతీయ గ్రంథపాలకుల దినోత్సవం ఘనంగా నిర్వహణ
వరంగల్‌ జిల్లాలో డిజిటల్‌ మౌలిక వసతుల విస్తరణ పై పార్లమెంట్ లో ప్రశ్నించిన వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య
సీఎం సభకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి : జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్
ఇందిరా మహిళా శక్తి చీరలు మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక: ఎమ్మెల్యే కేఆర్  నాగరాజు
బోర్లం గురుకులాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు  శ్రీకారం