శిశువుకు రోగనిరోధక శక్తిని అందించి,వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి.
సర్పంచ్ పడాల భాగ్యలక్ష్మి రాజు
అంగన్వాడీ కేంద్రంలో తల్లి పాల వారోత్సవాల్లో పాల్గొన్న సర్పంచ్ పడాల భాగ్యలక్ష్మి రాజు
ఓదెల , పెద్దపల్లి : ఓదెల మండలం బాయమ్మపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్త మారం సంధ్య ఆధ్వర్యంలో తల్లి పాల వారోత్సవాలు బుధవారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ పడాల భాగ్యలక్ష్మి రాజు హాజరయ్యారు.ఈ సందర్భంగా సర్పంచ్ పడాల భాగ్యలక్ష్మి మాట్లాడుతూ తల్లి పాల వల్ల శిశువుకు రోగనిరోధక శక్తిని అందించడమే కాక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి.ఈ సందర్భంగా కార్యకర్త మారం మాట్లాడుతూ ప్రపంచ తల్లి పాల వారోత్సవాలను ప్రతి సంవత్సరం ఆగస్ట్ 1 నుండి 7 వరకు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు.పుట్టిన బిడ్డకు తొలి గంటలోపే తల్లిపాలు పట్టడం,మొదటి ఆరు నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వడం యొక్క ప్రాముఖ్యత ను అందరికీ తెలియజేయడానికి ఈ వారం రోజులు అవగాహన కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు.శిశువు మెదడు వికాసానికి,ఆరోగ్యకరమైన శారీరక ఎదుగుదలకు తల్లిపాలు ఎంతో అవసరమన్నారు.తల్లిపాలు సులభంగా జీర్ణమై పిల్లలకు పొట్ట సంబంధిత సమస్య రాకుండా ఉంటాయిబిడ్డకు పాలివ్వడం వల్ల తల్లుల్లో రొమ్ము క్యాన్సర్,గర్భాశయ క్యాన్సర్ ముప్పు తగ్గుతుందన్నారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గాలి రాజు, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, వార్డు సభ్యులు,ఎఎన్ఎం,ఆశా వర్కర్,వీవో ప్రతినిధులు ఆలేటి స్వప్న,కావటి రాజు,పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


