పేద మహిళ పింఛన్‌పై పట్టు రుణం మాత్రం ఇతరుల చేతుల్లోనా.

పేద మహిళ పింఛన్‌పై పట్టు రుణం మాత్రం ఇతరుల చేతుల్లోనా.

  • బ్యాంకు మేనేజర్ లీడర్ గ్రామ దీపికల పాత్రపై తీవ్ర అనుమానాలు..!
  • అనసూయమ్మ పేరు వాడుకుని రూ14 లక్షల రుణం ఎవరి కోసం..!
  • రుణం తీసుకోని మహిళను రుణగ్రహీతగా ఎలా మార్చారు పత్రాలు బయటపెట్టాలంటున్న బాధితులు..!
  • తొమ్మిది మందికి సరిపోని సభ్యత్వానికి పదో సభ్యురాలిగా అనసూయమ్మను చేర్చింది ఎవరు..!
  • పొదుపు మాత్రం ఆమెతో కట్టించి రుణం ప్రయోజనం ఇతరులకు దక్కిందా..!
  • బ్యాంకు మేనేజర్‌కు తెలియకుండా ఇది జరిగిందా లీడర్ గ్రామ దీపికలకు తెలియకుండా జరిగిందా..!
  • పింఛన్ కోసం వెళ్లిన మహిళ ఖాతా హోల్డ్ చివరకు ఆమె మరణంతో బయటపడిన రుణ రహస్యం ఏమిటి..!
  • బాధ్యత ఎవరిది సమాధానం చెప్పాల్సింది ఎవరు అనసూయమ్మ కుటుంబం నిలదీత..!

చింతకాని : పేద మహిళకు అండగా నిలవాల్సిన వ్యవస్థలోనే ఆమె పేరుతో రుణ వ్యవహారం నడిచిందా అనే అనుమానాలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీశాయి లచ్చగూడెం గ్రామానికి చెందిన కర్రీ అనసూయమ్మ ప్రభుత్వ పింఛన్‌పై ఆధారపడి జీవిస్తుండగా 2023లో తొమ్మిది మంది సభ్యులతో ఉన్న పొదుపు లక్ష్మి సంఘంలో పదో సభ్యురాలిగా ఆమెను చేర్చినట్లు గ్రామ దీపిక చెప్పినట్లు బాధిత కుటుంబం పేర్కొంటోంది సంఘానికి సుమారు రూ14 లక్షల రుణం మంజూరైనప్పటికీ అనసూయమ్మకు ఆ రుణంలో ఎలాంటి ప్రయోజనం అందలేదని ఆమె కేవలం పొదుపు సొమ్ము మాత్రమే చెల్లించిందని గ్రామ దీపిక తెలిపినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది అనసూయమ్మకు రుణం ఇవ్వకపోతే ఆమె పేరుతో రుణ పత్రాల్లో ఏం చూపించారు ఆమె సమ్మతి లేకుండా రుణ ప్రక్రియ ఎలా పూర్తయింది ఆమె సంతకం లేదా వేలిముద్ర తీసుకున్నారా రుణం విడుదలైన సొమ్ము ఎవరికి చేరింది తొమ్మిది మంది సభ్యులే ఆ మొత్తాన్ని వినియోగించుకున్నారనే సమాచారం నిజమైతే పదో సభ్యురాలిగా అనసూయమ్మను చేర్చిన వ్యవహారంలో లీడర్ పాత్ర ఏమిటి గ్రామ దీపిక పాత్ర ఏమిటి రుణం మంజూరు చేసే సమయంలో బ్యాంకు మేనేజర్ మరియు సిబ్బంది ఏం పరిశీలించారు అనే ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది రుణం తీసుకోలేదని అనసూయమ్మ చెప్పినప్పటికీ టీజీవీబీ బ్యాంకు మేనేజర్ ఆమె ఖాతాను హోల్డ్‌లో పెట్టారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు తనకు రుణం రాలేదని చెబుతున్న మహిళ ఖాతాను హోల్డ్‌లో పెట్టే ముందు బ్యాంకు వద్ద ఉన్న ఆధారాలను ఆమెకు చూపించారా రుణం విడుదలైన విధానం పరిశీలించారా లేక కేవలం రుణ ఖాతాలో పేరు ఉందనే కారణంతోనే పింఛన్ ఖాతాను నిలిపివేశారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఒకవైపు అనసూయమ్మకు రుణ ప్రయోజనం దక్కలేదని చెబుతుండగా మరోవైపు అదే రుణం పేరుతో ఆమె పింఛన్ నిలిచిపోవడం వ్యవహారంలో వైరుధ్యాలను బయటపెడుతోందని బాధితులు అంటున్నారు అనసూయమ్మ అనారోగ్యంతో ఉండి వైద్యం కోసం డబ్బులు అవసరమైన సమయంలో పింఛన్ సొమ్ము అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని కుటుంబ సభ్యులు వాపోతున్నారు తనకు రావాల్సిన పింఛన్ సొమ్ము కోసం బ్యాంకుల చుట్టూ గ్రామ దీపికల చుట్టూ తిరుగుతూ సమస్యను పరిష్కరించాలని పలుమార్లు ప్రయత్నించినప్పటికీ స్పష్టమైన పరిష్కారం లభించలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు పింఛన్ కోసం ఒకవైపు బ్యాంకు మరోవైపు గ్రామ దీపికల వద్దకు వెళ్లి తిరిగి తిరిగి చివరకు అనసూయమ్మ ప్రాణాలు కోల్పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తనకు రుణం రాలేదని చెబుతున్న మహిళకు రుణ బాధ్యత ఎలా వచ్చిందో పింఛన్ ఖాతాను ఎందుకు నిలిపివేశారో తన జీవితకాలంలోనే స్పష్టత రాలేదని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు అనసూయమ్మకు జరిగిన అన్యాయంపై అధికారులు తక్షణమే స్పందించి రుణ పత్రాలు ఖాతా వివరాలు రుణ సొమ్ము విడుదలైన విధానం సభ్యత్వ నమోదు వివరాలు మరియు ఖాతా హోల్డ్‌కు సంబంధించిన ఆధారాలను పరిశీలించి వాస్తవాలను బయటపెట్టాలని వారు కోరుతున్నారు అనసూయమ్మకు న్యాయం చేయడంతో పాటు ఆమె పేరుతో రుణ వ్యవహారం నడిపినట్లు విచారణలో తేలితే బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Views: 16

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News