నార్సింగి ఎంపీ యూపీఎస్ పాఠశాలలో ఆహార ప్రదర్శన
పాపన్నపేట :మండల కేంద్రమైన నార్సింగి గ్రామంలోని ఎంపీ యూపీఎస్ పాఠశాలలో విద్యార్థులకు పోషకాహారంపై అవగాహన కార్యక్ర మం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల ఆహార పదార్థాలను ప్రదర్శించారు. సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. వివిధ రకాల ఆహార పదార్థాలను ఒకేచోట ప్రదర్శించి, వాటిలోని పోషక విలువల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను చిన్ననాటి నుంచే అలవర్చుకోవాలని సూచించారు.
Views: 58
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
19 Sep 2026 18:33:50
సిద్దిపేట జిల్లా/గజ్వేల్ : సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు భారత్ నగర్‌లో గరుడ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిన్నారులు ఏర్పాటు
