నసురుల్లాబాద్ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యం లో ధర్నా.

ఎమ్మార్వో ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.....

నసురుల్లాబాద్ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యం లో ధర్నా.

 కామారెడ్డి / బాన్సువాడ : బాన్సువాడ నియోజకవర్గం లోని నసురుల్లాబాద్ మండల కేంద్రంలో సోమవారం బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రెవెన్యూ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. 10 సంవత్సరాల బిఆర్ఎస్ ప్రభుత్వం లో   కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ రైతు బీమా  పథకాలు ను రద్దు చేయాలని  చూస్తున్న  కాంగ్రెస్ ప్రభుత్వం  హైకోర్టు    తీర్పు సాకు తో పేదింటి ఆడబిడ్డల భరోసాను  ఎత్తి వేసేందు కు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుంది మండిపడ్డారు. కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ హైకోర్టు లో కౌంటర్ వేయ కుండా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుంది తెలిపారు . తెలంగాణ ఆడ బిడ్డల  వారి తరుపున బిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఆడబిడ్డలు తులం బంగారం అడుగు తున్నందుకే పూర్తిగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ను ఎత్తు వేయాలని ఈ ప్రభుత్వం కుట్ర చేస్తుంది విమర్శించారు. ఈ పథకాల ను రద్దు చేస్తే తెలంగాణ ఆడబిడ్డల తరఫున బిఆర్ఎస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేల ను అడుగ డుగున అడ్డు కుంటామని హెచ్చరిస్తున్నాం అన్నారు. అనంతరం స్థానిక తాసిల్దార్ సువర్ణ కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమం లో గోడిశెల నరసింహులు,  టేకుర్ల సాయిలు,  గంపల శంకర్, రమేష్,  లక్ష్మణ్, కృష్ణ, రాజు,అక్తర్, భూమయ్య, సాయగౌడ్, భాస్కర్, హరి సింగ్, బాబు, మాడ లక్ష్మణ్, పార్టీ నాయకులు కార్యకర్తలుపాల్గొన్నారు
 
 
Views: 26

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డికి ఇండియన్ పోలీస్ మెడల్ కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డికి ఇండియన్ పోలీస్ మెడల్
కరీంనగర్,  : నక్సల్స్ కార్యకలాపాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడిలో విశేష సేవలు అందించిన కరీంనగర్ రూరల్ సీఐ అనుముల నిరంజన్ రెడ్డికి ఇండియన్ పోలీస్ మెడల్...
పక్కాగా 22-ఏ జాబితా రూపకల్పన
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై కాంగ్రెస్ కుట్ర
యూసుఫ్ పేటలో ఘనంగా నాగుల పంచమి వేడుకలు 
పరకాల పాలిటెక్నిక్ ఎదుట ఎస్ఎఫ్ఐ ధర్నా
శివంపేటలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని రైతుల వినతి
5వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు