ఘనంగా అరె కటిక సంఘం బోనాల వేడుకలు.
- తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్న బోనాలు.
- టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్.
నిజామాబాద్ : నిజామాబాద్ పట్టణంలో అరె కటిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల మహోత్సవంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలు సుఖశాం తులు, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. సమాజంలో ఐక్యత, సోదరభావాన్ని పెంపొందించే ఇలాంటి పండుగలు మన సంస్కృతికి గర్వకారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ నిజామాబాద్ మేయర్ ఉమారాణి, డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి రామకృష్ణ, మల్లికార్జున్, కార్పొరేషన్ చైర్మన్లు శేఖర్ గౌడ్, కేశ వేణు ,మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, ఆరెకటిక సంఘం జిల్లా అధ్యక్షులు రవీందర్, నగర అధ్యక్షులు జమాల్పూర్ రమేష్, రాజారాం, ఓం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. అరె కటిక సంఘం ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు.
Views: 11
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
05 Aug 2026 18:12:49
మందమర్రి, (మంచిర్యాల) : క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో ఒప్పంద పద్ధతిన పని చేస్తున్న కార్మికులకు పాత ప్రకారమే వేతనాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని మున్సిపల్ చైర్ పర్సన్...
