కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: బీఎంఎస్

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: బీఎంఎస్

మహబూబ్‌నగర్: జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) ఆధ్వర్యంలో కార్మికులు, ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఎంఎస్ జిల్లా కన్వీనర్ చిలుక రాఘవేందర్ రెడ్డి మాట్లా డుతూ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.కార్మికులకు కనీస వేతనాన్ని రూ.30 వేలుగా పెంచాలని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని కోరారు. అలాగే కార్మికులకు పూర్తి భద్రత కల్పించడంతో పాటు భవన నిర్మాణ కార్మికులు, గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్‌లో మరింత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని రాఘవేందర్ రెడ్డి హెచ్చరించారు. కార్యక్రమంలో మెడికల్ రిప్రజెంటేటివ్ ఉద్యోగులు, వివిధ రంగాల కార్మికులు పాల్గొన్నారు. 
Views: 75

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News