తల్లి పాలే బిడ్డకు శ్రీరామ రక్ష 

తల్లి పాలే బిడ్డకు శ్రీరామ రక్ష 

గజ్వేల్/సిద్దిపేట జిల్లా :  గజ్వేల్ మండలం అహ్మదిపూర్ అంగన్వాడి సెకండ్ సెంటర్ లో తల్లి పాల వారోత్సవాలు నిర్వహించడం జరిగింది. గర్భిణీలు, బాలింతలకు ప్రత్యేక అవగాహన కల్పించిన సూపర్వైజర్ భవానీ శిశువుకు తల్లిపాలే సంపూర్ణ పోషకాహారం, తొలి రక్షణ కవచమని సూపర్వైజర్ భవానీ తెలిపారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలలో గర్భిణీలు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యత, సరైన పద్ధతిలో పాలివ్వడం, పుట్టిన గంటలోనే ముర్రుపాలు ఇవ్వాల్సిన అవసరం, తొలి ఆరు నెలలు కేవలం తల్లిపాలే ఇవ్వాలనే అంశాలపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. తల్లి పాలే శిశువుకు తొలి రక్షణ తల్లిపాలు శిశువుకు అవసరమైన అన్ని పోషకాలను అందించడంతో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు, డయేరియా వంటి వ్యాధుల నుంచి రక్షిస్తాయి. మెదడు, కళ్ల అభివృద్ధికి తోడ్పడి ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు దోహదపడతాయి. ముర్రుపాల ప్రాముఖ్యత పుట్టిన వెంటనే వచ్చే ముర్రుపాలు శిశువుకు సహజ రోగనిరోధక శక్తిని అందించే అమూల్యమైన ఆహారం. శిశువు జన్మించిన తొలి గంటలోనే ముర్రుపాలు ఇవ్వడం అత్యంత అవసరమని పోషన్ అభియాన్ బ్లాక్ కోఆర్డినేటర్ కిరణ్ మాట్లాడుతూ, తొలి ఆరు నెలలు పూర్తిగా తల్లిపాలే ఇవ్వాలని, అనంతరం రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం అనుబంధ ఆహారంతో పాటు తల్లిపాలు కొనసాగించాలని సూచించారు. తల్లులు పోషకాహారం తీసుకుంటే శిశువుకు అవసరమైన పాలు సమృద్ధిగా ఉత్పత్తి అవుతాయని తెలిపారు శిశువు ఆరోగ్యానికి తల్లిపాలే అమృతం. ప్రతి తల్లి తల్లిపాల ప్రాముఖ్యతను గుర్తించి బిడ్డకు అందించాలి అని సూపర్వైజర్ భవానీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ భవాని, పోషణ్ అభియాన్ కిరణ్, హెల్త్ ఏ ఎన్ ఎమ్ ప్రభావతి, అంగన్వాడి టీచర్లు అనురాధ, కనక లక్ష్మి , బాలమణి, ఆశ వర్కర్ స్వరూప, గర్భిణీలు, బాలింతలు, తదితరులు పాల్గొన్నారు. 
Views: 48

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో వేగం పెంచాలి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో వేగం పెంచాలి
మందమర్రి, (మంచిర్యాల) : జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు,ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలలో వేగం పెంచి అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందేలా సమన్వయంతో కృషి చేయాలని...
మూడు నెలల రేషన్ కోటాను సజావుగా పంపిణీ చేయాలి
తాండూర్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులకు సన్మానం.
నాన్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం
చక్రియాల్‌లో హరితహారం వన మహోత్సవం ఘనంగా నిర్వహణ
తాండూరు బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్  శ్రీశైల్ రెడ్డి .
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు గడ్డపై టిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం.