ఐటీడీఏ ఉట్నూర్‌లో ప్రతి సోమవారం 'బోజ్జన్న బువ్వ'
ఆకలితో వచ్చే అర్జిదారులకు అన్నదానం
ఉట్నూర్, : ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయానికి ప్రతి సోమవారం వివిధ మండలాలు, గ్రామాల నుంచి దరఖాస్తులు సమర్పించేందుకు వచ్చే ప్రజలకు ఆకలితో ఇబ్బంది కలగకుండా 'బోజ్జన్న బువ్వ' కార్యక్రమం ద్వారా ఉచిత భోజనం అందిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజనులు, అర్జిదారులు తమ పనులు పూర్తయ్యే వరకు కార్యాలయం వద్ద వేచి ఉండాల్సి వస్తుండటంతో, వారి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఖానాపూర్ ఎమ్మెల్యే బోజ్జు పటేల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ప్రతి సోమవారం వందలాది మంది ప్రజలు ఈ కార్యక్రమం ద్వారా భోజనం చేసి ఎమ్మెల్యే బోజ్జు పటేల్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ప్రజలకు అవసరమైన సమయంలోఅండగానిలుస్తూ,ఆకలితోవచ్చినవారికి అన్నం పెట్టడం గొప్ప సేవ అనిపలువురు అభిప్రాయపడుతున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


