జానకంపేటలో డాక్టర్ తాళ్ల లక్ష్మీనారాయణ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించిన
టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్
నిజామాబాద్ :బోధన్ నియోజకవర్గంలోని జానకంపేట గ్రామంలో ఇటీవల కన్నుమూసిన ప్రముఖ కవి, డాక్టర్ తాళ్ల లక్ష్మీ నారాయణ గౌడ్ కుటుంబ సభ్యులను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షులు, ఎమ్మెల్సీ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ తాళ్ల లక్ష్మీనారాయణ గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళుల ర్పించిన మహేష్ కుమార్ గౌడ్, కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని సూచిస్తూ, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ వారి కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, డాక్టర్ తాళ్ల లక్ష్మీనారాయణ గౌడ్ వంటి గొప్ప కవిని కోల్పోవడం తెలుగు సాహిత్యానికి తీరని లోటని అన్నారు. సినారె వంటి మహోన్నత సాహిత్యవేత్తల సరసన నిలిచే ప్రతిభ ఉన్నప్పటికీ, ఆయనకు రావాల్సిన స్థాయి గుర్తింపు దక్కకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఆయన రచనలు, సాహిత్య సేవ చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు కేశ వేణు, శేఖర్ గౌడ్, రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, రామకృష్ణ, దయాకర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Views: 0
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
05 Aug 2026 18:12:49
మందమర్రి, (మంచిర్యాల) : క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో ఒప్పంద పద్ధతిన పని చేస్తున్న కార్మికులకు పాత ప్రకారమే వేతనాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని మున్సిపల్ చైర్ పర్సన్...
