పక్కాగా 22-ఏ జాబితా రూపకల్పన

పక్కాగా 22-ఏ జాబితా రూపకల్పన

  • క్షేత్రస్థాయి పరిశీలన తప్పనిసరి
  • గండిపేట తహసీల్దార్‌ కార్యాలయంలో అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డి సమీక్ష

గండిపేట, (రంగారెడ్డి): జిల్లాలోని 22-ఏ నిషేధిత ఆస్తుల జాబితాను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పక్కాగా రూపొందించాలని అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) చంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన గండిపేట తహసీల్దార్‌ కార్యాలయాన్ని సందర్శించి మండలంలోని గ్రామాల వారీగా ఉన్న నిషేధిత ఆస్తుల జాబితాను, సంబంధిత రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జాబితాలోని ప్రతి ఆస్తికి సంబంధించిన వివరాలను రెవెన్యూ దస్తావేజులతో సరిపోల్చాలని సూచించారు. కేవలం రికార్డుల ఆధారంగానే కాకుండా, అవసరమైన సందర్భాల్లో క్షేత్రస్థాయి పరిశీలన (ఫీల్డ్ ఇన్‌స్పెక్షన్) చేపట్టి వాస్తవ పరిస్థితులను నిర్ధారించుకోవాలన్నారు. ప్రభుత్వ, వివాదాస్పద భూములు నిబంధనల ప్రకారం నిషేధిత పరిధిలోకి వచ్చేలా చూడాలని, అర్హత కలిగిన ప్రైవేటు ఆస్తులు పొరపాటున ఈ జాబితాలో చేరకుండా పూర్తి పారదర్శకత పాటించాలని స్పష్టం చేశారు. గ్రామాల వారీగా పత్రాలను పరిశీలించి సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గండిపేట తహసీల్దార్‌ ఎన్‌.శ్రీనివాస్‌ రెడ్డితో పాటు రెవెన్యూ అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
 
Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ప్రజావాణికి 5 భూ సంబంధిత ఫిర్యాదులు ప్రజావాణికి 5 భూ సంబంధిత ఫిర్యాదులు
మర్పల్లి, (వికారాబాద్): మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం ఐదు భూ సంబంధిత ఫిర్యాదులు అందినట్లు ఎంపీడీవో శాంతమ్మ తెలిపారు. ప్రజల...
కళ్యాణ లక్ష్మి షాదీ ముభరక్ పథకాలను కొనసాగించాలి
ట్యాంక్ బండ్ పై పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటు హర్షణీయం.
ప్రజావాణికి ఐదు శాఖల అధికారులే హాజరు.
కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డికి ఇండియన్ పోలీస్ మెడల్
పక్కాగా 22-ఏ జాబితా రూపకల్పన
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై కాంగ్రెస్ కుట్ర