మల్యాలలో 48 సీసీ కెమెరాలను ప్రారంభించిన జిల్లా ఎస్పీ
మల్యాల,: జగిత్యాల జిల్లా మల్యాల గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన 48 సీసీ కెమెరాల నిఘా వ్యవస్థను జిల్లా ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నివారణకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. నూతన చట్టాల ప్రకారం కోర్టుల్లోసీసీ ఫుటేజీ బలమైన సాక్ష్యంగా నిలుస్తుందన్నారు. గ్రామాన్ని సురక్షితంగా ఉంచేందుకు ప్రత్యేక చొరవ తీసుకుని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన సర్పంచ్ బొట్ల జయప్రసాద్ని, గ్రామ పంచాయతీ పాలకవర్గాన్నిఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. వ్యాపారస్తులు, ప్రజలు కూడా తమ ఇళ్లు, దుకాణాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొట్ల జయప్రసాద్ , ఉప సర్పంచ్ వినయ్ కుమార్, వార్డు సభ్యులు, స్థానిక సీఐ, ఎస్సై మరియు తదితరులు పాల్గొన్నారు.
Views: 4
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
18 Aug 2026 17:01:56
ఓదెల : పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో మండల వ్యవసాయ అధికారి భాస్కర్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం బోనస్ ప్రకటించిన 7...
