5వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు
- శేరిలా గ్రామస్థుల ఆందోళన
- పరిష్కరించే వరకు దీక్ష ఆపేది లేదు
- సర్పంచ్ బంజ లావణ్య రవి
మెదక్ : తెలంగాణ పబ్లిక్ స్కూల్ వెల్దుర్తి లోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ శేరిలా గ్రామస్థులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నేటికి 5వ రోజుకు చేరుకున్నాయి.గ్రామంలోని యువకులు, మహిళలు, రైతులు వంతుల వారీగా దీక్షలో పాల్గొంటున్నారు. అధికారు లు, ప్రజాప్రతినిధులు ఇప్పటివరకు స్పందించకపోవడంతో దీక్షా శిబిరంలో ఉద్రిక్తత నెలకొంది. దీక్షలో కూర్చున్న గ్రామస్తులు మాట్లాడుతూ మా గ్రామ సమస్యను పరిష్కరించే వరకు ఈ దీక్ష కొనసాగుతుంది. ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలి అని డిమాండ్ చేశారు.వారికి పలు గ్రామాల ప్రజలు, సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బత్తుల నవీన్ వార్డు మెంబెర్ గోగుల యాదగిరి ఎంచర్ల రవి బండ మల్లేష్ డాకులు జగ్గలింగం బత్తుల భాను తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


