మల్లన్న భక్తులకు `వానర' సమస్య
కొమురవెల్లి (సిద్దిపేట): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానం ను నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించు కుంటారు. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు స్వామివారి దర్శనము కంటే ముందుగా కోతుల సమస్య వారిని కలవరపెడు తుంది. దర్శనం వెళ్లే మార్గము, గంగ రేణు చెట్టు దగ్గర పట్నం వేసే భక్తులకు స్వామివారి పటానికి సంబంధించిన కుంకుమ, పసుపు, పిండి, మొదలగు పూజ సామాగ్రిని తీసుకువెళ్లి పడవేయడం, దర్శనానంతరం స్వామి వారి ప్రసాదాలు తీసుకొని వెళ్లే భక్తులపైన దాడి చేసి గాయ పరుస్తున్నాయి, అలాగే స్వామివారి దర్శనానంతరం నిత్యాన్న దానంలో భాగంగా భక్తులకు భోజన వసతి కల్పించే దగ్గర ఈరోజు ఉదయం కనిపించిన దృశ్యంలో కోతులు వందలాదిగా చేకూరాయి తద్వారా భక్తులు ఆవైపు వెళ్ళటానికి భయపడుతున్నారు. కేవలం స్వామివారిని దర్శించుకునే భక్తులకే కాకుండా స్థానికంగా నివసించే గ్రామ ప్రజలకు ఎన్నోసార్లు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనిపైన దేవస్థానాధికారులు, గ్రామపంచాయతీ పాలకవర్గం సమన్వయంతో దృష్టి సారించి సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరుతున్నారు. గతంలో చింపాంజీ వేషంలో కోతులను తరిమికొట్టి నామమాత్రంగా పరిష్కరణ చేపట్టారు అలా కాకుండా శాశ్వత పరిస్కారం చూపే విధంగా దృష్టి పెట్టాలని గ్రామ ప్రజలు , భక్తులు కోరుతున్నారు.
Views: 5
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
17 Aug 2026 15:55:24
క్షేత్రస్థాయి పరిశీలన తప్పనిసరి
గండిపేట తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి సమీక్ష
