సర్పంచుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి

తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్

సర్పంచుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి

మహబూబ్‌నగర్: గ్రామ పంచాయతీల బలోపేతం, సర్పంచుల హక్కులు, పెండింగ్ నిధుల విడుదల తదితర డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్, మహబూబ్‌నగర్ జిల్లా సర్పంచుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు సర్పంచుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018ను రద్దు చేయడం లేదా అవసరమైన సవరణలు చేయాలని, 73వ రాజ్యాంగ సవరణలోని 243, 11వ షెడ్యూల్‌లో పేర్కొన్న 29 అంశాలకు సంబంధించిన అధికారాలు, విధులు, నిధులను గ్రామ పంచాయ తీలకు యథాతథంగా బదలాయించాలని కోరారు. గ్రామాల్లో రాజకీయ వివాదాల కారణంగా అభివృద్ధికి ఆటంకం కలుగు తున్నందున ఉప సర్పంచులకు ఉన్న చెక్ పవర్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేసిన విధంగా గ్రామ పంచాయతీల విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలని, స్థానిక సెస్‌లు, స్టాంప్ డ్యూటీ, సీనరేజ్, మైనింగ్, ఇతర పన్నుల ఆదాయాన్ని నేరుగా గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ చేయాలని కోరారు. నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీల పరిధిని నిర్ణయించి, తండా గ్రామ పంచాయతీలకు భవనాలు, రహదారులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.ముఖ్యమంత్రి ప్రకటించిన మైనర్ గ్రామ పంచాయతీలకు రూ.5 లక్షలు, మేజర్ గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. గత రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.500 కోట్ల జనరల్ ఫండ్ బకాయిలను విడుదల చేయడంతో పాటు, 15వ ఆర్థిక సంఘం కింద కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన రూ.1,090 కోట్ల బకాయిలను, రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్లకు సంబంధించిన రూ.2,979 కోట్ల పెండింగ్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో సర్పంచులకు ఓటు హక్కు కల్పించాలని, సర్పంచుల గౌరవ వేతనాన్ని రూ.6,500 నుంచి రూ.25,000కు పెంచాలని కోరారు. ఇందిరమ్మ కమిటీల పేరుతో గ్రామ సభలు, సర్పంచుల అధికారాలను నిర్వీర్యం చేసే జీవోను వెంటనే రద్దు చేయాలని, MGNREGS నిధులను నేరుగా గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు చింపుల సత్యనారాయణ రెడ్డి, రాష్ట్ర, రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ప్రధాన కార్యదర్శి బాదేపల్లి సిద్ధార్ధ, రాష్ట్ర కార్యదర్శి మందిపల్లి వెంకట్, మహబూబ్‌నగర్ జిల్లా సర్పంచుల సంఘం కన్వీనర్ బత్తుల వెంకట్రాములు గౌడ్ B.A., LL.B. తదితరులు పాల్గొన్నారు.
 
Views: 38

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డికి ఇండియన్ పోలీస్ మెడల్ కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డికి ఇండియన్ పోలీస్ మెడల్
కరీంనగర్,  : నక్సల్స్ కార్యకలాపాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడిలో విశేష సేవలు అందించిన కరీంనగర్ రూరల్ సీఐ అనుముల నిరంజన్ రెడ్డికి ఇండియన్ పోలీస్ మెడల్...
పక్కాగా 22-ఏ జాబితా రూపకల్పన
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై కాంగ్రెస్ కుట్ర
యూసుఫ్ పేటలో ఘనంగా నాగుల పంచమి వేడుకలు 
పరకాల పాలిటెక్నిక్ ఎదుట ఎస్ఎఫ్ఐ ధర్నా
శివంపేటలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని రైతుల వినతి
5వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు