చౌటకూర్‌లో ఘనంగా నాగుల పంచమి వేడుకలు

శ్రీ శ్రీ శ్రీ అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర ఆలయంలో భక్తుల ప్రత్యేక పూజలు

చౌటకూర్‌లో ఘనంగా నాగుల పంచమి వేడుకలు

చౌటకూర్, : సంగారెడ్డి జిల్లా నాగుల పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని చౌటకూర్ మండల కేంద్రంలోని శ్రీ శ్రీ శ్రీ అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర దేవాలయం మరియు నాగదేవత ఆలయాల్లో భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.తెల్లవారుజాము నుంచే ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నాగదేవత విగ్రహాలకు పంచామృతాలు, పాలతో అభిషేకాలు చేసి, పండ్లు మరియు పూలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పెళ్లికాని యువతులు, సంతానం లేని మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించి తమ కోరికలు నెరవేరాలని ప్రార్థించారు.భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో సందడిగా మారాయి. ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ నిర్వాహకులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. నాగుల పంచమి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో ఆలయంలో భక్తులు  పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 
Views: 91

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డికి ఇండియన్ పోలీస్ మెడల్ కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డికి ఇండియన్ పోలీస్ మెడల్
కరీంనగర్,  : నక్సల్స్ కార్యకలాపాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడిలో విశేష సేవలు అందించిన కరీంనగర్ రూరల్ సీఐ అనుముల నిరంజన్ రెడ్డికి ఇండియన్ పోలీస్ మెడల్...
పక్కాగా 22-ఏ జాబితా రూపకల్పన
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై కాంగ్రెస్ కుట్ర
యూసుఫ్ పేటలో ఘనంగా నాగుల పంచమి వేడుకలు 
పరకాల పాలిటెక్నిక్ ఎదుట ఎస్ఎఫ్ఐ ధర్నా
శివంపేటలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని రైతుల వినతి
5వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు