వైభవంగా అనంత లక్ష్మీనారాయణ స్వామి కల్యాణం.
బోధన్, (నిజామాబాద్) : బోధన్ పట్టణంలోని బురుడుగల్లీలో గల శ్రీశ్రీశ్రీ అనంత లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో శ్రావణ మాసం పురస్కరించు కొని ఆదివారం స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమం, యాగం, గోపూజ తదితర కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మధ్యాహ్నం భక్తుల కోసం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సాయంత్రం స్వామివారికి పల్లకి సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గమరపేట శంకర్, చక్రి,లింగం, వెంకట్, ప్రవీణ్, ప్రసాద్,భాస్కర్, అక్షయ్,ప్రశాంత్,వినోద్, విగ్నేష్,నితిన్,యశ్వంత్, ప్రణయ్,శివకుమార్,కార్తీక్, సిద్దు,శివ చరణ్,అజయ్ నందు,కిట్టు,వినోద్ తదితరులు పాల్గొన్నారు.
Views: 0
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
17 Aug 2026 16:41:20
కరీంనగర్, : నక్సల్స్ కార్యకలాపాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడిలో విశేష సేవలు అందించిన కరీంనగర్ రూరల్ సీఐ అనుముల నిరంజన్ రెడ్డికి ఇండియన్ పోలీస్ మెడల్...
