పేదల సంక్షేమ పథకాలను కొనసాగించాలి: బీఆర్ఎస్ నాయకులు
కొత్తగూడెం : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలను ఎలాంటి జాప్యం లేకుండా యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు లక్ష్మీదేవిపల్లి మండల తహసీల్దార్‌కు మెమోరాండం అందజేశారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు పిలుపు మేరకు లక్ష్మీదేవిపల్లి మండల బీఆర్ఎస్ అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఎంతోమంది పేద, మధ్యతరగతి కుటుంబాలకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు ఆర్థికంగా అండగా నిలిచాయని అన్నారు. పేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహం భారంగా మారకుండా ఈ పథకాలు ఎంతోమందికి సహాయపడ్డాయని పేర్కొన్నారు. ఈ పథకాల ద్వారా అనేక కుటుంబాల ఇళ్లలో ఆనందం వెల్లివిరిసిందన్నారు. ప్రజలకు ఉపయోగపడుతున్న సంక్షేమ పథకాలను నిలిపివేయాలని ప్రభుత్వం ఆలోచించడం సరైన నిర్ణయం కాదని అన్నారు. ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన ప్రభుత్వం పేదలకు అండగా నిలిచే పథకాలను కొనసాగించాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు.కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలను ఎలాంటి జాప్యం లేకుండా కొనసాగించాలని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మున్సిపల్ వైస్ చైర్మన్ వేల్పుల దామోదర్, ఎదురుగడ్డ సురేష్, వినోద్, ఉపసర్పంచ్ శ్రీను, శ్రీకాంత్ నాయక్, రాజవరపు మురళి, తరాల దాము, తరాల మహేష్, శ్రీను, పొగాకు వెంకటేశ్వర్లు, శివ, లాలు తండా శ్రీను, ఉపసర్పంచ్ బట్టు రవి, మంగ్య, స్టేజి రమేష్, లావుడియా ప్రసాద్, పెద్దతండ రవి, శివ, చిన్న, నాగరాజు, చిన్ని, వంశీ, చిన్ను, పూర్ణాచారి తదితరులు పాల్గొన్నారు.
Views: 5
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
17 Aug 2026 16:41:20
కరీంనగర్, : నక్సల్స్ కార్యకలాపాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడిలో విశేష సేవలు అందించిన కరీంనగర్ రూరల్ సీఐ అనుముల నిరంజన్ రెడ్డికి ఇండియన్ పోలీస్ మెడల్...
