అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండాలి..కౌన్సిలర్ చింతల వసంత
బెల్లంపల్లి మంచిర్యాల : ప్రత్యేక ఓటర్ల సమగ్ర సవరణలో భాగంగా విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాపై గురువారం బెల్లంపల్లి పట్టణంలోని 15వ వార్డు సభలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని వార్డు కౌన్సిలర్ చింతల వసంత అన్నారు. జాబితాలో పేర్లు గల్లంతైన వారు, వివరాల్లో తప్పులు ఉన్నవారు, మ్యాపింగ్ కాని ఓటర్లు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఓటర్ల జాబితాపై ఏవైనా ఫిర్యాదులు, అభ్యంతరాలు ఉంటే సంబంధిత బీఎల్‌ఓలను సంప్రదించి దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. కార్యక్రమంలో వార్డు ఆఫీసర్ అశోక్, రాజేందర్, బీఎల్‌ఓలు ముత్యాలు, పద్మ వార్డ్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


