మైనింగ్‌ ఏడీ ఇంటిపై ఏసీబీ దాడులు 

మైనింగ్‌ ఏడీ ఇంటిపై ఏసీబీ దాడులు 

  •  ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సోదాలు
  • 8 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు 

బోడుప్పల్‌, : ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మైనింగ్‌ ఏడీ జయరాజు నివాసంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం ఉదయం సోదాలు నిర్వహించారు. బోడుప్పల్‌ ఈస్ట్‌ హనుమాన్‌నగర్‌లోని ఆయన నివాసంతోపాటు మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టినట్లు తెలిసింది.హైదరాబాద్‌ ఏసీబీ జాయింట్‌ డైరెక్టర్‌ సాయి మనోహర్‌, వరంగల్‌ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. జయరాజుకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాలు, ఆస్తుల పత్రాలు, బ్యాంకు లావాదేవీలు తదితర వివరాలను పరిశీలిస్తున్నారు.

 ఇప్పటివరకు గుర్తించిన ఆస్తులు

సోదాల్లో ఇప్పటివరకు రెండు కార్లు, రూ.1.50 లక్షల నగదు, రెండు బుక్స్‌, జనగామ జిల్లాలో ఐదు ఎకరాల వ్యవసాయ భూమి, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, పోస్టల్‌ డిపాజిట్లకు సంబంధించిన వివరాలు లభించినట్లు సమాచారం. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలను ఏసీబీ అధికారులు వెల్లడించాల్సి ఉంది.

WhatsApp Image 2026-08-27 at 10.46.42 AM

Views: 12

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ప్రకృతితో రాఖీలు.. మొక్కలకు రాఖీ కట్టి పర్యావరణ పరిరక్షణ సందేశం ప్రకృతితో రాఖీలు.. మొక్కలకు రాఖీ కట్టి పర్యావరణ పరిరక్షణ సందేశం
నల్లగొండ/మర్రిగూడ మండలం: మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల దామెర భీమనపల్లిలో రాఖీ పౌర్ణమి సందర్భంగా వినూత్నంగా ప్రకృతి రాఖీ ఉత్సవం నిర్వహించారు.ప్రకృతిలో సహజంగా లభించే చెట్ల ఆకులు,...
లెంకలపల్లి రైతువేదికలో పంటల నమోదుపై అవగాహన
మామిడిపల్లి లో ఇందిరమ్మ ఇళ్ళు నూతన గృహప్రవేశం
మంచిర్యాల 47 వ డివిజన్ లొ SIR కార్యక్రమం
భట్టి ప్రోత్సాహంతో మట్టి మాఫియా కోట్లలో నడుస్తుంది.
ఇల్లూరు గ్రామంలో అన్ని వీధుల్లో వర్షాకాల పారిశుద్ధ్య చర్యలు
మైనింగ్‌ ఏడీ ఇంటిపై ఏసీబీ దాడులు