పురాతన శివాలయాన్ని సందర్శించిన రిటైర్డ్ ఐఏఎస్
వరంగల్( నల్లబెల్లి ) : శనిగరం గ్రామపంచాయతీ రెవెన్యూ పరిధిలో గల కాకతీయ కాలంలో నిర్మించిన శివాలయాన్ని సందర్శించుటకు రిటైర్డ్ ఐఏఎస్ శరత్ (హర్యానా క్యాడర్) రావడం జరిగింది. వారికి అట్టి శివాలయం ప్రాచుర్యాన్ని గ్రామ సర్పంచ్ వివరించడం జరిగింది. ఇట్టి ఆలయాన్ని డెవలప్మెంట్ చేయుటకు గతంలో పురావస్తు శాఖ వరంగల్ కి, మండల ఎమ్మార్వో నల్లబెల్లి కి గ్రామపంచాయతీ ద్వారా లెటర్ రాయడం జరిగింది అని వారికి వివరించడం జరిగింది. అది విన్న తర్వాత ఇంతటి విశిష్టత కలిగిన శివాలయాన్ని, శివాలయం యొక్క మాన్యం భూమిని వెలుగులోకి తీసుకురావడం అనివార్యమని తెలుపుతూ వారు ఇట్టి విషయాన్ని జిల్లా కలెక్టర్ కి మరియు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలపడం జరిగింది వారి సందర్శనార్థం గ్రామ సర్పంచ్ ఉట్కూరి అశోక్ , పంచాయతీ కార్యదర్శి బి మధు , జిపిఓ పైడయ్య మరియు గొల్లపల్లి కరుణాకర్ తదితరులు అందుబాటులో ఉండడం జరిగింది.
Views: 3
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
04 Aug 2026 18:44:58
మందమర్రి, (మంచిర్యాల) : జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు,ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలలో వేగం పెంచి అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందేలా సమన్వయంతో కృషి చేయాలని...
