ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో పట్టణ అభివృద్ధికి కృషి. 

ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో పట్టణ అభివృద్ధికి కృషి. 

  • తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్రెడ్డి.
  • 12వ వార్డులో ఓపెన్ జిమ్ పార్క్ అభివృద్ధి పనులకు చైర్ పర్సన్ శ్రీకారం.

తాండూరు (వికారాబాద్ జిల్లా) తాండూర్ ఎమ్మెల్యే *శ్రీ బుయ్యని మనోహర్ రెడ్డి సహకారంతో తాండ్రు పట్టణ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు  మున్సిపల్ చైర్‌పర్సన్  పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం 12వ వార్డులో రూ.5 లక్షల వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఓపెన్ జిమ్ పార్క్ అభివృద్ధి పనులకు చైర్పర్సన్ భూమిపూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు, యువతతో పాటు అన్ని వయసుల వారు వ్యాయామం చేసేలా ఓపెన్ జిమ్ పార్క్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. పట్టణ అభివృద్ధితో పాటు ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్, తాండూర్ టౌన్ ప్రెసిడెంట్, మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. 
 
Views: 26

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో వేగం పెంచాలి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో వేగం పెంచాలి
మందమర్రి, (మంచిర్యాల) : జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు,ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలలో వేగం పెంచి అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందేలా సమన్వయంతో కృషి చేయాలని...
మూడు నెలల రేషన్ కోటాను సజావుగా పంపిణీ చేయాలి
తాండూర్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులకు సన్మానం.
నాన్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం
చక్రియాల్‌లో హరితహారం వన మహోత్సవం ఘనంగా నిర్వహణ
తాండూరు బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్  శ్రీశైల్ రెడ్డి .
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు గడ్డపై టిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం.