22ఏ సమస్య నుంచి తప్పించుకునేందుకే ఎర్రపల్లి అస్త్రం

22ఏ సమస్య నుంచి తప్పించుకునేందుకే ఎర్రపల్లి అస్త్రం

దౌల్తాబాద్‌,సిద్దిపేట: రాష్ట్రంలో 22ఏ నిషేధిత భూముల సమస్య తీవ్రంగా ఉన్న సమయంలో కేసీఆర్‌ కుటుంబ భూముల అంశాన్ని సీఎం రేవంత్‌రెడ్డి తెరపైకి తేవడం రాజకీయ దృష్టి మళ్లింపు వ్యూహమేనని దౌల్తాబాద్ మాజీ బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సయ్యద్‌ రహీమొద్దీన్‌ అన్నారు. 22ఏ వల్ల భూములు రిజిస్ట్రేషన్లు కాక రైతులు, భూ యజమానులు ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ ఫాంహౌస్‌ భూముల్లో అక్రమాలు జరిగి ఉంటే మూడేళ్ల క్రితమే రెవెన్యూ విచారణ జరిపి నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉందన్నారు. ఇప్పుడు అసెంబ్లీలో భూముల లెక్కలు వెల్లడించడం వెనుక రాజకీయ ప్రయోజనం ఉందన్న అనుమానాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు. ఇది కేవలం రాజకీయ మైలేజీ కోసం చేసిన ప్రకటనగానే మిగిలిపోతుందని రహీమొద్దీన్‌ అన్నారు.

Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

భీమ్‌రెడ్డి కేసులో బినామీల ఇళ్లలో ఏసీబీ సోదాలు  భీమ్‌రెడ్డి కేసులో బినామీల ఇళ్లలో ఏసీబీ సోదాలు 
హైదరాబాద్: సస్పెండైన డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డికి సంబంధించిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ దర్యాప్తును ముమ్మరం చేసింది. భీమ్‌రెడ్డికి బినామీలుగా అనుమానిస్తున్న ఎనిమిది మంది ఇళ్లలో...
సీనియర్ జర్నలిస్ట్ కొప్పు నర్సింహులు పదో వర్ధంతి
రిమ్స్ ను సందర్శించిన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు 
భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు
సుల్తాన్‌పూర్‌లో అంగరంగ వైభవంగా కోలాటాల కార్యక్రమం
ఉమ్మడి మెదక్ జిల్లా సీనియర్ ఖోఖోఎంపికలు..:మెదక్ జిల్లా అధ్యక్షుడు హరికిషన్ 
ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటళ్లలో ఫైర్ సేఫ్టీపై మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్ష