రసవత్త రంగా సాగిన మండల సమావేశం
బాల్కొండ , నిజామాబాదు : నిజామాబాదు జిల్లా బాల్కొండ మండల ప్రజా పరిషద్ సమావేశం గురువారం రోజు ఏం. డి. ఓ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశం లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు గురించి బాల్కొండ మండల సర్పంచులు అంశాన్ని ప్రస్థావిస్తూ బాల్కొండలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని కోరుతూ మండల అభివృద్ధి అధికారి కి మండల సర్పంచు లు విజ్ఞప్తి చేయాగ స్థానిక మండల విద్యాధికారిణి కృష్ణ వేణి ఈ విషయాన్ని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు గురించి జీ.వో ను జారీ చేశారని ఈ జివో ప్రకారంగా రాష్ట్రం లోని అన్ని నియోజక కేంద్రాల్లో అన్ని రవాణా సౌకర్యాలు ఉన్న చోటనే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారని, ఇందులో భాగంగా బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గం లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని సర్పంచూలు కోరారు.ఈ విషయంలో గతంలో ఉన్నత అధికారులకు విన్నవించామని బాల్కొండ సర్పంచ్ గాండ్ల రాజేష్ తెలిపారు.స్కూల్ ఏర్పాటు గురించి ఆర్మూర్ సబ్ కలెక్టర్ గారిని బాల్కొండ లో ఉన్న జిల్లాపరిషద్ ఉన్నత పాఠశాల గదులను,ల్యాబ్ లను, ఓపెన్ గ్రౌండ్ను స్కూల్ ప్రక్కనే ఉన్న ప్రభుత్వ భూములను చూడాలని విజ్ఞప్తి చేసారు.కావున బాల్కొండలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయించాలని మండల సర్పంచుల సంగం అధ్యక్షులు జి. మోహన్ రెడ్డి అధికారుల్ని కోరారు.ఈ రోజు సమావేశంలో బాల్కొండ తహసీదారు శ్రీనివాస్ మండల అభివృద్ధి అధికారి విజయ భాస్కర్ రెడ్డి ఎంపీవో గంగ మోహన్ రాధావినాయక్, మండల విధాధికారిణి కృష్ణవేణి, మిషన్ భగీరథ వెంకటేశం, ఏపీవో ఇందిరా ఏ.ఈ.ఎన్ రాజు విద్యుత్ ఏ.ఈ ఎస్.కిషన్ తదితర అధికారులు నివేదికను చదివి వినిపించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


