ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
నిజామాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, బోధన్ ఎమ్మెల్యే శ్సుదర్శన్ రెడ్డి జన్మదినం సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సుదర్శన్ రెడ్డి నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి, ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షు కలిగి ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి మాట్లాడుతూ, నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో సుదర్శన్ రెడ్డి ప్రస్థానం ఎంతో ఆదర్శప్రాయమైందని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన చూపుతున్న చొరవ, ప్రజలతో మమేకమై పనిచేసే తీరుతో ప్రత్యేక గుర్తింపు పొందారని అన్నారు.రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి ఆయన సేవలు మరింత విస్తరించాలని, రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులను అలంకరించి ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కలగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర గీతా పారిశ్రామిక సహకార కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్, మానాల మోహన్ రెడ్డి, తాహెర్ బిన్ హందాన్,తదితరులు పాల్గొన్నారు.
Views: 0
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
08 Aug 2026 18:02:41
చౌటకూర్,: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలోని శివంపేట గ్రామ శివారులోని బీరు ఫ్యాక్టరీ నుంచి వ్యర్థ జలాలు మంజీరా నదిలోకి కలుస్తున్నాయని ఆరోపిస్తూ గ్రామస్తులు రాష్ట్ర...
